VVS Laxman Chief Selector: ໑໖ ໑ ໖ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?

Date:

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్‌ పదవిలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు బీసీసీఐ సుముఖంగా లేనట్లు సమాచారం. అగార్కర్ స్థానంలో భారత మాజీ దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ను కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించేందుకు బోర్డు పరిశీలిస్తోంది.

ఇంగ్లాండ్ పర్యటనలో జట్టు ప్రదర్శనతో పాటు, రోహిత్ శర్మ భవిష్యత్తుపై అగార్కర్ స్పందించిన శైలి పట్ల బీసీసీఐ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌తో అగార్కర్ 3 నెలల పొడిగించిన పదవీకాలం ముగియనుండటంతో కొత్త హెడ్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (సీఓఈ) హెడ్‌గా ఉన్న లక్ష్మణ్‌కు భారత క్రికెట్ వ్యవస్థపై, యువ ఆటగాళ్లపై పూర్తి అవగాహన ఉంది. ఆయన నాయకత్వం టీమిండియా భవిష్యత్తుకు మేలు చేస్తుందని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...