Weather Forecast Today: వాయుగుండం ప్రభావం..ఇవాళ పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!

Date:

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం సోమవారం ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున బుధవారం వరకు చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.

వచ్చే రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మేఘావృత వాతావరణం కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

వార్నీ.. ఇన్నాళ్లూ సోంపు నీళ్లను ఇంత లైట్ తీసుకున్నామా? రోజూ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతున్నాయా?...

దానిమ్మతో చెడు కొవ్వుకు చెక్.. ఇలా తీసుకుంటే ప్రయోజనాలు పొందొచ్చా?

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతుందా? ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా గుండెను...

లక్షలు కాదు.. కోట్ల కిలోలు! 24 గంటల్లో భారతీయులు తినే చక్కెర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఉదయం నిద్రలేవగానే తాగే వేడి టీ నుంచి రాత్రి పడుకునే ముందు...