Weather Report: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

Date:

ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది.

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బుధవారం నాటికి ఇది అల్పపీడనంగా మారే అవకాశముందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఏపీ విషయానికొస్తే.. అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం, బుధవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పలుచోట్ల పిడుగులు పడే అవకాశముందని, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని సూచించింది.

ఏపీకి రెడ్ అలర్ట్ జారీ

భోగాపురం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, చోడవరం, వేపాడ, ఎస్ కోట వంటి ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక చిత్తూరు, తిరుపతి, నగరి, సత్యవేడు, పుతతూరు, కన్నవరం వంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. ఇక పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

తెలంగాణలో రెండ్రోజుల పాటు వానలు

ఇక తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కాగా ఏపీ, తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఎల్‌నివో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు విస్తరించినా అనుకున్నంతగా వర్షాలు పడలేదు. కానీ గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...