ఏపీలో దర్శనమిచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం 33 అడుగుల పొడవు రూ.3 కోట్లు ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారంటే

Date:

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ హైవే మీద ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా శివలింగం దర్శనం ఇచ్చింది. 33 అడుగుల పొడవుతో.. 210 టన్నుల బరువున్న భారీ రాతి శివలింగాన్ని చూసి శివయ్య భక్తులు మురిసిపోతున్నారు.

ఈ శివలింగాన్ని దర్శించుకున్నందుకు తమ జన్మ ధన్యం అయ్యింది అంటున్నారు. మరి ఇంత భారీ శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించబోతున్నారు.. ఎక్కడ రూపుదిద్దుకుంది.. ఎంత ఖరీదు అయ్యింది వంటి ఆసక్తికర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఈ శివలింగాన్ని బిహార్‌లోని చంపారన్ జిల్లాలో ప్రతిష్ఠించనున్నారు. దీన్ని తమిళనాడులోని మహాబలిపురం నుంచి చంపారన్ తరలిస్తున్నారు. 114 టైర్లున్న భారీ హైడ్రాలిక్ ట్రక్కు మీద ఈ శివలింగాన్ని తరలిస్తున్నారు. ఈక్రమంలో ఆళ్లగడ్డ హైవే మీద ఈ భారీ శివలింగం దర్శనం ఇచ్చింది. ఇది గమనించిన స్థానికులు ఏపీలో దర్శనం ఇచ్చిన అత్యంత ఎత్తైన శివలింగం అంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

ఈ శివలింగం సుమారు 33 అడుగుల పొడవు ఉంది. 210 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ శివలింగం విలువు రూ.3 కోట్లు. మహాబలిపురం నుంచి బిహార్ చేరడానికి దాదాపు 20-25 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. శివలింగం బరువును దృష్టిలో ఉంచుకుని దీన్ని తరలించడానికి.. 114 టైర్లున్న హైడ్రాలిక్ ట్రక్‌ని వినియోగిస్తున్నారు.

ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం పర్యవేక్షణలో.. ఈ భారీ శివలింగాన్ని బిహార్ కు తరలిస్తున్నారు. శివలింగాన్ని ప్రతిష్టించబోయే విరాట్ రామాలయం ఎత్తు… కంబోడియాలోని 12వ శతాబ్దపు అంగ్కోర్ వాట్ ఆలయం కన్నా మరింత ఎత్తుగా ఉండేలా డిజైన్ చేసి నిర్మిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....