ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి

Date:

Tribal Ration Point: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు PVTG కొందు గిరిజన గ్రామంలో కలెక్టర్ నిశాంతి చొరవతో కొత్త రేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇకపై 15 కిలోమీటర్లు నడిచి రేషన్ తెచ్చుకునే కష్టానికి ముగింపు పలుకుతూ, బియ్యం అందుకున్న గిరిజన మహిళలు దింసా నృత్యంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. ప్రభుత్వ పథకాలు వారికి ఆమడ దూరం.. నెలనెలా అందాల్సిన రేషన్ బియ్యం కూడా తెచ్చుకోవాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. రాళ్లు రప్పలు దాటుకుంటూ వెళ్తేనే నాలుగు బియ్యం గింజలు వాళ్లకు దొరికేది. కొన్ని సందర్భాల్లో వర్షాలు వచ్చినా మరి ఇతర కారణాలతో వెళ్లకపోతే ఆ బియ్యం కూడా వారికి దక్కవు. ఎట్టకేలకు అధికారులు చొరవతో ఆ గ్రామానికి రేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. గిరిజనులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. దీంతో వాళ్లంతా పట్టలేనంత ఆనందంతో సందడి చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ మడ్రేబు PVTG కొందు గిరిజన గ్రామం. 29 కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. నెలనెలా రేషన్ సరుకులు తీసుకోవాలంటే వేలమామిడికి వెళ్ళాలి. అందుకోసం 15 కిలోమీటర్లు నడవాలి. రాను పోను ప్రయాణానికి ఓ రోజంతా వారికి గడిచిపోతుంది. అంత కష్టపడితేనే వాళ్లకు నెలకు అందాల్సిన రేషన్ దక్కుతుంది. లేకపోతే.. ఒక్క గింజ కూడా వాళ్లకు ఆ రేషన్ బియ్యం అందదు. వారి కష్టాలు అధికారుల దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు స్పందించారు. కలెక్టర్ నిశాంతి చొరవతో వాళ్లకు రేషన్ కష్టాలు తీరాయి. రేషన్ పాయింట్ ఏర్పాటు చేసి బియ్యం పంపిణీ చేయడంతో… ఆ ఆదివాసి కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బియ్యం తీసుకున్న తర్వాత ఆదివాసి గిరిజన మహిళలు దింసా నిత్యంతో తన ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ అడవి బిడ్డలు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...