
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని అధికార పక్షం కబ్జా చేసిందని వ్యాఖ్యానించారు.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
ఇవి అసలు ఎన్నికలేనా?
ఎన్నికల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. రాష్ట్రంలో జరిగిన పరిణామాలను నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలుగా పరిగణించవచ్చా? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలు, నిబంధనలు పాటించలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల నిర్వహణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు.
