ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. వాటికి NHAI ఆమోదం

Date:

ఏపీ రాజధాని అమరావతికి మణిహారంగా భావిస్తున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మరో అప్ డేట్ వచ్చింది. అమరావతి ఓఆర్ఆర్ ఐదు జిల్లాల పరిధిలో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల 3ఏ వివరాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాల 3ఏ వివరాలకు NHAI, మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి. ఎన్టీఆర్ జిల్లా వివరాలు కూడా ఆమోదం పొందితే అభ్యంతరాలు తెలుసుకునేందుకు పత్రికా ప్రకటన జారీ చేస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కు(ORR) సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఐదు జిల్లాల పరిధిలో చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని జిల్లాల నుంచి 3ఏ ప్రతిపాదనలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వద్దకు చేరాయి. దీంతో అన్ని జిల్లాలకు సంబంధించిన 3ఏ నోటిఫికేషన్ వివరాలను జాతీయ రహదారుల సంస్థ అధికారులు పోర్టల్‌లో నమోదు చేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును గుంటూరు. కృష్ణా, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నిర్మించనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...