జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ విద్యాసంస్థ యాజమాని దుర్మరణం!

Date:

కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు (కల్లపరు) టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం (జూలై 28) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ యజమాని నున్న సురేష్ (52) మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం, నున్న సురేష్ తన కుటుంబ సభ్యులు నున్న విమల దేవితో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కారులో బయలుదేరారు. బొమ్మలూరు టోల్‌గేట్ సమీపానికి చేరుకోగానే ముందుగా నిలిపి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో నున్న విమల దేవికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...