
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ధరల లోటు భర్తీ పథకం కింద ప్రతి కిలో పొగాకుకు రూ.20 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.188 కోట్లు వెచ్చించనున్నాయి.
అలాగే రాష్ట్రంలో 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. బ్రైట్ గ్రేడ్ పొగాకు కిలో ధర రూ.240, మీడియం గ్రేడ్ రూ.190, లో గ్రేడ్ రూ.110 కంటే తగ్గకుండా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

