కూచ్ బెహార్ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ అండర్-19 జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు యశ్వీర్ గౌడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 26 నుంచి 29 వరకు చండీగఢ్‌లో జరిగే మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును జూనియర్ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేసింది.

టీజీ20లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తరఫున ఆడిన యశ్వీర్ గౌడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆదిత్య వర్ధన్ వైస్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. అదే జట్టుకు చెందిన పేసర్ దేవ్ మెహతాకు కూడా అండర్-19 జట్టులో చోటు లభించింది. యువ ఆటగాళ్లతో కూడిన హైదరాబాద్ జట్టు కూచ్ బెహార్ ట్రోఫీలో ఎలా రాణిస్తుందో చూడాలి.

హైదరాబాద్ అండర్-19 జట్టు:

యశ్వీర్ గౌడ్ (కెప్టెన్), ఆదిత్య వర్ధన్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), షేక్ రోషన్, శివరామకృష్ణ, ప్రిన్స్, రాంచరణ్, ఆదిత్య జవ్వాజి (వికెట్ కీపర్), దుర్గ ఉజ్వల్, వేదొడ్డి, హరి ఓం సింగ్, దేవ్ మెహతా, నిపుణ్ రెడ్డి, ఆయుష్ మల్హోత్రా, పార్థ శర్మ, ఆదిత్య మల్హోత్రా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *