
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి గతంలో అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉన్నారంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
రాజ్వీర్ డియోల్‌తో పెళ్లంటూ ప్రచారం
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ చిన్న కుమారుడు, యువ హీరో రాజ్వీర్ డియోల్‌తో సారా టెండూల్కర్ వివాహం జరగబోతోందనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఇరు కుటుంబాలు పెళ్లి విషయంపై చర్చలు జరుపుతున్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, 2027లో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు బయటకు రాలేదు.
2023లో హీరోగా రాజ్వీర్ ఎంట్రీ
సన్నీ డియోల్ కుమారుడైన రాజ్వీర్ డియోల్ 2023లో విడుదలైన హిందీ రొమాంటిక్ డ్రామా ‘డోనో’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. మరోవైపు సారా టెండూల్కర్ కూడా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో క్రికెట్, సినీ రంగాలకు చెందిన రెండు ప్రముఖ కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడబోతోందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
సారా, శుభ్‌మన్ గిల్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ గతంలో వచ్చిన వార్తలు కూడా అధికారికంగా ధ్రువీకరణకు నోచుకోలేదు. ఇప్పుడు రాజ్వీర్ డియోల్‌తో పెళ్లి అంటూ కొత్త ప్రచారం మొదలైంది. అయితే సారా టెండూల్కర్ కానీ, రాజ్వీర్ డియోల్ కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు. అటు సచిన్ టెండూల్కర్, ఇటు సన్నీ డియోల్ కుటుంబాల నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఈ వార్తలను ధ్రువీకరించని ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది. అసలు ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే సంబంధిత కుటుంబాల స్పందన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
