అవిసెగింజలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, జుట్టు, చర్మ సంరక్షణలోనూ ఉపయోగపడతాయి. ముఖ్యంగా వీటితో తయారు చేసే జెల్ ప్రస్తుతం ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. అవిసెగింజలను ఉడికించి తయారు చేసిన ఈ సహజ జెల్ జుట్టుకు తేమను అందించడంతో పాటు, స్టైలింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కర్లీ హెయిర్ ఉన్నవారికి ఇది చక్కని ఎంపికగా చెప్పవచ్చు. జుట్టులో ఫ్రిజీనెస్ను తగ్గించి, కర్ల్స్ ఆకృతిని మెరుగ్గా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. అయితే, ఇది అందరికీ ఒకే విధంగా పనిచేయకపోవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారు ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

ఫ్లాక్స్ సీడ్ జెల్‌ను జుట్టుకు అప్లై చేయడం వల్ల కేశాలు మృదువుగా, మెరిసేలా కనిపించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా కర్లీ హెయిర్ ఉన్నవారు ఈ జెల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టుకు తేమను అందించి, కర్ల్స్ను సాఫ్ట్‌గా, చక్కగా కనిపించేలా చేయడంలో తోడ్పడుతుంది. పొడిబారిన, నిర్జీవంగా కనిపించే జుట్టు ఉన్నవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో అనేక బ్రాండ్లు ఫ్లాక్స్ సీడ్ జెల్‌ను విక్రయిస్తున్నాయి. అయితే, మార్కెట్లో కొనుగోలు చేయకుండా ఇంట్లోనే ఈ జెల్‌ను సహజమైన పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు, వస్తువులు:
- పావు కప్పు అవిసె గింజలు
- 2 కప్పుల నీరు
- ఒక జల్లెడ
- ఒక గిన్నె
- ఒక చెంచా
- ఒక కంటైనర్ (నిల్వ చేసుకోవడానికి)
ఆప్షనల్‌గా
లావెండర్, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్స్ 1 లేదా 2 చుక్కలు
1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్
1 టీస్పూన్ విటమిన్ ఇ ఆయిల్
ఉప్పు చిటికెడు
ఎలా తయారుచేయాలి?
అడుగు అంటకుండా

అవిసెల్ని జెల్లా మారే వరకూ కలుపుతూ ఉండాలి. లేదంటే త్వరగా అడుగు అంటుకుంటుంది. గరిటెను పైకి తీసినప్పుడు వెనుక భాగానికి అంటుకోవాలి. దీనికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. ఆ టైమ్‌లో మెల్లిగా కలపండి. జెల్లా మారిన తర్వాత జల్లెడలో వేసి స్పూన్‌తో తిప్పండి. జెల్ మొత్తాన్ని గిన్నెలో పోయండి. ఇది చిక్కగా, కాస్తా జెల్లీగా ఉంటుంది. దీంతో సరైన విధంగా జెల్లా మారుతుంది. దీనిని గిన్నెలో వడకట్టండి. చల్లారే వరకూ ఉంచండి. మరీ ఎక్కువగా చల్లారనివ్వొద్దు. గోరువెచ్చగా మారాలి.
మీకు అదనపు ప్రయోజనాల కోసం
జెల్ కొద్దిగా చల్లారిన తర్వాత, మీ చర్మానికి సరిపడే ఎసెన్షియల్ ఆయిల్‌ను అవసరమైతే కలపండి. అయితే, ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు కాబట్టి ఏ పదార్థమైనా అందరికీ సరిపోతుందని భావించకూడదు. చర్మానికి ఇబ్బంది కలిగించని పదార్థాలనే ఎంచుకోవాలి. సిద్ధం చేసుకున్న జెల్‌ను శుభ్రమైన కంటెయినర్లో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచండి. ఉపయోగించే ముందు చర్మంపై చిన్న ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేసి, ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్న తర్వాతే వాడండి. దురద, మంట లేదా ఎరుపుదనం వంటి లక్షణాలు కనిపిస్తే వాడటం ఆపేయండి.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, నిపుణులు వెల్లడించిన అంశాల ఆధారంగా ఈ వివరాలను అందించాం. వీటిని ఆచరించే ముందు అవసరమైతే వైద్య నిపుణుల సలహా తీసుకోండి. ఈ సమాచారాన్ని పాటించాలా వద్దా అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. ఈ వివరాలను సమయం తెలుగు ధృవీకరించడం లేదు.
