భార్య భర్తకు విధేయురాలిగా ఉండాలి! సుమారు 31 శాతం మంది అబ్బాయిలు ఇదే కోరుకుంటున్నారట, సర్వేలో వెల్లడైన కీలక విషయాలు

Date:

ప్రపంచం సమానత్వం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కొంత మంది Gen Z యువత ఆలోచనా ధోరణి ఇంకా పాతకాలపు విధానాలనే అనుసరిస్తోంది. భర్తకు భార్య విధేయురాలిగా ఉండాలి అంటూ ఓ వర్గం యువత పాత తరం కంటే ఎక్కువ సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తున్నారు. కెరీర్‌లో రాణించే, తమతోపాటు సమానంగా సంపాదించే భార్య ఉండాలి కానీ ఇంట్లో మాత్రం విధేయురాలిగా ఉండాలని కోరుకుంటున్నారట. సమాజం ఎమనుకుంటుందో అనే మగసిరి కట్టుబాట్ల వల్ల అవాస్తవ ఒత్తిడికి లోనవుతున్నారట.

నేటి ఆధునిక కాలంలోనూ Gen Z యువత సైతం కొన్ని పాత ఆలోచనలతోనే ముందుకు సాగుతున్నట్లు ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకరు ‘భార్య ఎప్పుడూ భర్తకు విధేయురాలిగా ఉండాలి’ అని నమ్ముతున్నారట. భారతదేశంతో సహా సమారు 29 దేశాల్లో జరిగిన ఈ అధ్యయనంలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రకారం ప్రపంచం మొత్తం సమానత్వం దిశగా పరుగులు తీస్తున్న 2026లోనూ లింగ వివక్ష నీడలు ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. ఈ క్రమంలో Gen Z ఎందుకు పాతకాలపు ఆలోచనా ధోరణిని అనుసరిస్తుందో తెలుసుకుందాం.

ఈ అధ్యయనం ప్రకారం Gen Z యువకుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు అంటే సుమారు 31 శాతం మంది భార్య ఎల్లప్పుడూ భర్తకు విధేయురాలిగా ఉండాలనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారట. అసలైన పాతకాలపు పద్ధతులను చూసిన తరం కంటే నేటి Gen Z యువకులే తమ భాగస్వామి విధేయురాలిగా ఉండాలని కోరుకుంటున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...