
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఆర్నబ్ అతి తీవ్ర తుఫాన్ తీరం దాటింది. యానాంకు నైరుతి దిశలో నరసాపురం సమీపంలో తుఫాన్ తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుఫాన్ కాస్తా తీవ్ర తుఫాన్‌గా బలహీనపడినట్లు తెలిపింది.
తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంది. తుఫాన్ తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు పాటించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఏపీపై తుఫాన్ ప్రభావం పలు జిల్లాలో భారీ వర్షపాతం
ఏపీపై ఆర్నబ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. దాదాపు 36 ప్రాంతాల్లో 143 చోట్ల అత్యంత భారీ వర్షాలు, 205 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
- కన్నూరుపాలెం (అనకాపల్లి) – 26.1సెం.మీ. వర్షపాతం
- భోగాపురం (విజయనగరం) – 25.9సెం.మీ. వర్షపాతం
- ముడసర్లోవ (విశాఖ) – 25.9 సెం.మీ. వర్షపాతం
- తాడి (అనకాపల్లి) – 24.5 సెం.మీ. వర్షపాతం
- పరవాడ (అనకాపల్లి) – 24.5 సెం.మీ. వర్షపాతం
- సోమలింగంపాలెం (అనకాపల్లి) – 23.9 సెం.మీ. వర్షపాతం
- అచ్యుతాపురం (అనకాపల్లి) – 23.9 సెం.మీ. వర్షపాతం
- సింహాచలం (విశాఖ) – 23.6 సెం.మీ. వర్షపాతం
- చామలపల్లె (విశాఖ)-23.5 సెం.మీ. వర్షపాతం
- వేపాడ (విజయనగరం) – 22.7 సెం.మీ. వర్షపాతం
- పద్మనాభపురం (విశాఖ) – 22.5 సెం.మీ. వర్షపాతం
- దేశపాత్రునిపాలెం (అనకాపల్లి) – 22.4 సెం.మీ. వర్షపాతం
- కొత్తవలస (విజయనగరం) – 22.3 సెం.మీ. వర్షపాతం
- అచ్చుతాపురం, కొత్తవలసలో 22 సెం.మీ. వర్షపాతం
