
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను పరిశీలించారు.
తుఫాన్ కదలికలు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను ఆర్టీజీఎస్ అధికారులు సీఎంకు వివరించారు. వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందా అని సీఎం ఆరా తీశారు. జాతీయ రహదారులతో పాటు ఇతర మార్గాల్లో చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
తుఫాన్ హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ సీఎంకు వివరించారు. మనమిత్ర యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేస్తూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
