
D News: Oct 30: DTV డిజిటల్ అనుబంధ సంస్థ BSRG గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్‌పర్సన్ శ్రీమతి మణికుమారి అమ్మగారు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. నిన్న రాత్రి విజయవాడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
మణికుమారి అమ్మగారి మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె చూపించిన ప్రేమాభిమానాలు, అందించిన సేవలు, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
BSRG గ్రూప్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మణికుమారి అమ్మగారి మృతి పట్ల DTV డిజిటల్ సిబ్బంది, పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.
కాగా, మణికుమారి అమ్మగారి అంత్యక్రియలు ఈరోజు విజయవాడలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మణికుమారి అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
