CM Revanth Reddy: ఆ జిల్లా వాసులకు సీఎం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే కోట్ల రూపాయలతో..

Date:

రాష్ట్ర అభివృద్ది తెలంగాణ సర్కార్ ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటంది. ఇప్పటికే మేడారం ఆలయాన్ని అభివృద్ది చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని మరో ఆలయంలో అభివృద్ది పనులను చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీన బాసరలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం రూ.300 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇందులో భాగంగానే బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చించారు. ఇక ఈ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇంచార్జ్‌ మంత్రి జూపల్లి ఇప్పటికే ఆలయానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. బాసర ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రూ.500 కోట్లతో కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రణాళికలు అమలయితే బాసర పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుందన్నారు.

అందే కాదు ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి, విద్యా రంగాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సుమారు రూ.600 కోట్లతో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టబోతున్నట్టు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఆదిలాబాద్ జిల్లా అభివృద్దిలో కీలకంగా మారనున్నాయన్నారు. అలాగే బోథ్ నియోజకవర్గంలో రూ.1200 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా ఈ పాఠశాలనను ప్రభుత్వం తీర్చదిద్దబోతుందన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...