మురసు’ తుపాను ప్రభావంతో బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులు జువ్వలదిన్నె తీరంలో చిక్కుకుపోయారు.

విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో మత్స్యశాఖ అధికారులు స్థానిక మత్స్యకారుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టి, సముద్రంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అలాగే వారి బోటును కూడా సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు.

ఈ సహాయక చర్యల్లో అప్రమత్తంగా వ్యవహరించిన మత్స్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అభినందించారు.

By Ramya