ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే ఈ ఫలితంపై బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె విజ్ఞప్తితో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అధికారులు మరోసారి ఓట్లను లెక్కిస్తుండటంతో ఇరు పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు తుది ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By Ramya