రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా, తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. జిల్లాలో మొత్తం 96 వార్డులకు ఎన్నికలు జరగగా, వైసీపీ అభ్యర్థులు కేవలం మూడు వార్డుల్లో మాత్రమే విజయం సాధించారు.

మరోవైపు, కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయాన్ని నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా మండపేటలో కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అక్కడ మొత్తం 36 వార్డులనూ కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు.

జిల్లాలో వెలువడుతున్న ఈ ఫలితాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయపరంపరతో స్థానిక రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

By Ramya