D News: Nov 4: ఏపీలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రారంభ తేదీ ఖరారు.. 686 పోస్టుల భర్తీ!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గత నెలలో విడుదల చేసిన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 686 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వివిధ విభాగాల్లో 686 పోస్టులు

ఈ నియామకాల్లో భాగంగా డిప్యూటీ తహశీల్దార్‌ పోస్టులు 200, డిప్యూటీ మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు 176, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (GAD) పోస్టులు 71, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు 90 ఉన్నాయి. వీటితో పాటు ఇతర విభాగాల్లోనూ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పూర్తి వివరాల కోసం

ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, వేతనం, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అభ్యర్థులు అధికారిక సూచనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.