
అయ్యన్నపేట: విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 27 జడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 1,586 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీటిలో 793 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు
for more :MPtc Zptc election ubdates in dtv digital.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
