Heavy Queues at Polling Stations in Kakinada District; Minor Clash Reported in Pithapuram

కాకినాడ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు కనిపించాయి.

పిఠాపురం మండలం మంగితుర్తి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యూలైన్లలో ఉన్న ఓటర్ల వద్దకు వెళ్లి కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాల వారిని పోలింగ్ కేంద్రం పరిసరాల నుంచి బయటకు పంపించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.