ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీకి చెందిన MPTC అభ్యర్థి పళనిపై వైసీపీ నేతలు దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital

ఎన్నికల పోలింగ్ సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 7వ తేదీన నిర్వహించనున్నారు. కౌంటింగ్ అనంతరం ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.