Coal India Jobs 2026: పదో తరగతి అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం

Date:

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1055 మైనింగ్‌ సర్దార్‌, డిప్యూటీ సర్వేయర్‌, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ పోస్టులను.

కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1055 మైనింగ్‌ సర్దార్‌, డిప్యూటీ సర్వేయర్‌, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 15, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సు లేదా మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

మైనింగ్ సిర్దార్‌షిప్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ లేదా సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మే 14, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 చొప్పున ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఓలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.47,330 జీతంతోపాటు ఇతర అవలెన్సులు కూడా చెల్లిస్తారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...