వంటగదిలోకి భార్యను వెళ్లకుండా అడ్డుకోవడం మానసిక క్రూరత్వమే.. బాంబే హైకోర్టు

Date:

నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్న ఓ జంట మధ్య కొద్ది రోజుల్లకే మనస్పర్దలు వచ్చాయి. ఇరువురి మధ్య తరుచూ గొడవలతో విబేధాలు వీధికెక్కాయి. తనకు విడాకులు కావాలని భర్త డిమాండ్ చేయడం, మహిళను వంటింటిలోకి వెళ్లకుండా అత్తింటివాళ్లు అడ్డుకోవడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యింది. దీంతో భర్త, అత్తపై గృహహింస కేసు పెట్టింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సదరు భర్త బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై నాగ్‌పూర్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

అత్తింటిలో మహిళను వంట చేయకుండా నిరోధించడం అనేది ఆమె గౌరవాన్ని దెబ్బతీసే ఒక రకమైన మానసిక క్రూరత్వమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తనకు వ్యతిరేకంగా భార్య పెట్టిన వేధింపుల కేసును కొట్టివేయాలంటే భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ఓ జంటకు 2022లో వివాహమైంది. అయితే, పెళ్లైన కొద్ది రోజుల నుంచే భార్యాభర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. భార్యను వేధింపులకు గురిచేశారు. అత్తింటివాళ్లు తనను అత్యంత హీనంగా చూశారని, తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఊర్మిళా జోషి-ఫాల్కే.. భర్తకు వ్యతిరేకంగా నమోదైన వేధింపుల కేసును కొట్టేయడానికి నిరాకరించారు. భార్యను నిరంతరం వేధించడం, ఆమె కదలికలను పరిమితం చేయడం, ఇంట్లో ఆమెకు కనీస అవసరాలను అందకుండా చేయడం వంటివి మానసిక క్రూరత్వానికి స్పష్టమైన ఉదాహరణలని వ్యాఖ్యానించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...