
సనాతన సంప్రదాయాల ప్రకారం రావణుడిని చెడుకు ప్రతీకగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది విజయదశమి రోజున దేశవ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. అయితే, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం రావణుడిని భక్తితో ఆరాధిస్తారు. ఆయనకు ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించి పూజలు నిర్వహిస్తుండటం విశేషం.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా సమీపంలో ఉన్న బిస్రఖ్ గ్రామాన్ని రావణుడి జన్మస్థలంగా స్థానికులు విశ్వసిస్తారు. ఇక్కడ రావణుడికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పూజలు నిర్వహిస్తారు. మరోవైపు మధ్యప్రదేశ్లో రావణుడి పేరుతో ఓ గ్రామం ఉండటం కూడా ఆసక్తికరమైన విషయం. ఇక మందసౌర్ ప్రాంతాన్ని రావణుడి భార్య మండోదరి పుట్టిల్లుగా స్థానికులు భావిస్తారు. ఈ నమ్మకం కారణంగా అక్కడి ప్రజలు రావణుడిని తమ ఇంటి అల్లుడిగా పరిగణిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రావణుడి పట్ల ఉన్న ఈ భిన్నమైన ఆచారాలు, విశ్వాసాలు ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నాయి.
భారీ బడ్జెట్తో అత్యాధునిక సాంకేతికతను జోడించి తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాలో రావణాసురుడి పాత్ర ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆదికావ్యమైన రామాయణంలో రావణుడి బాల్యం, అపారమైన జ్ఞానం, అసాధారణ శక్తులు, వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి మనవడైన విశ్రవుడు, రాక్షస కన్య కైకసికి జన్మించిన రావణుడు బ్రాహ్మణ, రాక్షస వంశాల అంశలను కలిగి ఉన్నాడు. చిన్నతనం నుంచే అపారమైన ప్రతిభ కలిగిన ఆయన నాలుగు వేదాలు, ఆరు వేదాంగాల్లో పాండిత్యం సంపాదించాడు. రావణుడికి ఉన్న పది తలలను నాలుగు వేదాలు, ఆరు శాస్త్రాలపై ఆయనకున్న అపారమైన జ్ఞానానికి ప్రతీకగా వివరిస్తుంటారు. అంతేకాకుండా ముల్లోకాల్లోనే అత్యంత గొప్ప శివభక్తుల్లో రావణుడు ఒకరిగా ప్రసిద్ధి చెందాడు.
ఇంతటి అపారమైన విద్య, జ్ఞానం, శక్తి సంపద ఉన్నప్పటికీ రావణుడి అహంకారం, అధర్మమైన కోరికలే చివరకు ఆయన పతనానికి కారణమయ్యాయని రామాయణం వివరిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది విజయదశమి రోజున రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. అయినప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో రావణుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయనను ఇప్పటికీ ఆరాధ్యుడిగా భావిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లాలో రావణుడి పేరుతో ఓ గ్రామం ఉండటం విశేషం. ఇలా ఒకవైపు చెడుకు ప్రతీకగా రావణుడి దహనం జరుగుతుంటే.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆయనకు పూజలు నిర్వహించడం భారతీయ సంస్కృతిలోని విభిన్న విశ్వాసాలను తెలియజేస్తోంది.
మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో నటేరన్ తహసీల్ పరిధిలో ‘రావణ్’ పేరుతో ఓ గ్రామం ఉంది. ఇక్కడి ప్రజలు రావణ బ్రహ్మను తమ గ్రామానికి రక్షకుడిగా, ఇష్టదైవంగా భావించి భక్తితో పూజిస్తారు. గ్రామంలో రావణాసురుడి 12 అడుగుల శయన విగ్రహంతో కూడిన పురాతన ఆలయం కూడా ఉంది. గ్రామంలో ఏదైనా శుభకార్యం నిర్వహించాలన్నా, పెళ్లి జరపాలన్నా లేదా కొత్త పనిని ప్రారంభించాలన్నా ముందుగా రావణుడికి ఆహ్వాన పత్రిక సమర్పించి ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడి సంప్రదాయం. దసరా పండుగ రోజున దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా రావణ దహనం చేయరు. బదులుగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేస్తారు. ‘జై లంకేష్’ అంటూ రావణుడిని స్మరించుకుంటారు. ఆయనలోని శివభక్తి, వేద పాండిత్యాన్ని ఎంతో గౌరవిస్తారు.
మధ్యప్రదేశ్లోని మందసౌర్ ప్రాంతాన్ని రావణుడి భార్య మండోదరి జన్మస్థలంగా స్థానికులు విశ్వసిస్తారు. ఈ నమ్మకంతో అక్కడి ప్రజలు రావణాసురుడిని తమ ఇంటి అల్లుడిగా భావించి గౌరవిస్తారు. మందసౌర్లోని ఖాన్పురా ప్రాంతంలో రావణుడి భారీ విగ్రహం ఉంది. ప్రతి విజయదశమి సందర్భంగా ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, స్థానిక మహిళలు ముసుగులు ధరించి రావణుడికి గౌరవం సమర్పించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. సాధారణంగా దసరా రోజున రావణ దహనం జరిగే వేళ.. ఈ ప్రాంతంలో మాత్రం ఆయనను అల్లుడిగా భావించి పూజలు నిర్వహించడం విశేషంగా నిలుస్తోంది.
Log inSign up for free
