భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే వెల్లింగ్టన్లో జరుగుతోంది. న్యూజిలాండ్ 127 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో కైల్ జేమీసన్ అవుటయ్యాడు. 39 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ క్రీజులో ఉన్నారు. భారత్ తరఫున గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు, ఆకిబ్ నబీ రెండు వికెట్లు పడగొట్టారు.

వర్షం కారణంగా ఆట ప్రారంభం సుమారు గంట ఆలస్యమైంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు 47 ఓవర్ల చొప్పున జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.
