
అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న వేళ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు చీకట్లోనే ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది.
కల్యాణదుర్గంలోని కౌంటింగ్ కేంద్రంతో పాటు SVGM డిగ్రీ కళాశాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే రాయదుర్గం, డి.హీరేహాల్, బొమ్మనహాల్, కనేకల్లు కౌంటింగ్ కేంద్రాల్లోనూ పవర్ కట్ ఏర్పడినట్లు సమాచారం.
విద్యుత్ అంతరాయం కారణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో అధికారులు చీకట్లోనే లెక్కింపు కొనసాగిస్తున్నారు. కీలక సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజెంట్లలో ఆందోళన నెలకొంది.
