హమ్మయ్యా.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర.. ఈరోజు మే 8న గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే

Date:

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా భారీగా పెరుగుతూ ఆందోళన కలిగించినా ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన క్రమంలో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం బంగారం రేట్లు దిగివచ్చి ఊరట కల్పించాయి. ఈ క్రమంలో మే 8వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం.

ఎట్టకేలకు బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలవడం, ఆ వెంటనే ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపేయడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగా ఉంది. యూఏఈ, అమెరికా నౌకలే లక్ష్యంగా ఇటీవలే ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ నౌకలపై అమెరికా సైతం దాడులు చేపట్టింది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హార్ముజ్‌లో అమెరికా చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపేయడం, ఉద్రిక్తతలు తగ్గడం వంటి పరిణామాలతో బంగారం ధరలు దిగివచ్చినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా తగ్గడమూ పసిడి రేట్లు తగ్గేందుకు కారణమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మే 8వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎంతెంత పలుకుతున్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్ల పెరుగుదలకు రెండ్రోజుల తర్వాత బ్రేకులు పడ్డాయి. భారీగా పెరిగి బెంబేలెత్తించిన పసిడి ధరలు ఈరోజు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 320 మేర తగ్గింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,52,680 వద్దకు దిగివచ్చింది. దిగివచ్చింది. దీంతో 10 గ్రాములకు రూ.1,39,950 వద్దకు తగ్గింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....