తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది. నవంబర్ 8, 2026 నాటి సమాచారం ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.

శ్రీవారిని దర్శించుకున్న 80 వేల మందికి పైగా భక్తులు

నవంబర్ 7న మొత్తం 80,367 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 27,401 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలతో రూ.3.34 కోట్ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా 4.02 లక్షల లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయించింది.

తిరుమలలో గదుల లభ్యత ఇలా..

నవంబర్ 8వ తేదీ ఉదయం 7.30 గంటల సమయానికి తిరుమలలోని వసతి గదుల లభ్యత వివరాలు ఇలా ఉన్నాయి. రూ.50, రూ.100 అద్దె విభాగాల్లో మొత్తం 428 గదులు అందుబాటులో ఉన్నాయి. రూ.1,000, రూ.1,523 అద్దె విభాగాల్లో మాత్రం నాలుగు గదులే ఖాళీగా ఉన్నాయి. తిరుమల యాత్రకు బయలుదేరే భక్తులు దర్శన సమయం, గదుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

By Ramya