
ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా సహకార అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చేపట్టిన చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను పది రోజుల్లోగా సమర్పించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2027 జనవరిలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఏపీలో సహకార సంఘాల ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో రాష్ట్రంలో సహకార ఎన్నికల సందడి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
