భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి ప్రజలు తరలివస్తున్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం (Charminar Bhagyalakshmi Temple) వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి ప్రజలు తరలివస్తున్నారు. నిన్న (ఆదివారం) చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో 7 గంటలకు ఖజానా పంపిణీని ప్రారంభించారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి వెండి కాయిన్స్ పంపిణీ చేస్తున్నారు.

గుల్జారా హౌస్ 500 మీటర్ల వరకు భక్తుల క్యూ లైన్స్ కిక్కిరిశాయి. ఈ క్రమంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అమ్మవారి కాయిన్ లభిస్తే తమకు సకల శుభాలు, సిరిసంపదలూ కలుగుతాయని భక్తులు నమ్మకంగా భావిస్తారు. ఈ నాణేలను సొంతం చేసుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మూడు రోజుల పాటు అమ్మవారి ఖజానాను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు కాయిన్స్ పంపిణీ కొనసాగనుందని ఆలయ కమిటీ పేర్కొంది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *