
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 158ను విడుదల చేసింది.
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు ఉద్యోగ నియామక నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్‌ను ఎంచుకునేందుకు ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పించింది. ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవడానికి 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఉద్యోగులు ‘నిధి’ పోర్టల్ ద్వారా తమ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందినవారు మరణించిన ఉద్యోగుల కుటుంబ పెన్షనర్లు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే వారు తమ తొలి నియామక అధికారి నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఎంపిక జాబితా, నియామక ఉత్తర్వులు, విధుల్లో చేరినట్లు ధ్రువీకరించే పత్రాలను పొందాలి. సంబంధిత ధ్రువపత్రాల సర్టిఫైడ్ కాపీలను 15 పని దినాల్లోగా అందించాలని తొలి నియామక అధికార
