
టాలీవుడ్లో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతేడాది ‘సారంగపాణి జాతకం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. ఈసారి యువ కథానాయకుడు రోషన్ మేకతో కలిసి ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కలయికలో ‘జటాయు’ అనే సినిమా తెరకెక్కనుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నవంబర్ 11న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నారు. ‘సన్ ఆఫ్ వైజయంతి’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బాలుసు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
విభిన్నమైన కథాంశంతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సమాచారం. రోషన్ మేక్ కెరీర్లోనే ‘జటాయు’ ఓ కీలకమైన చిత్రంగా నిలవవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్ 11న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
‘ఏమో ఏమో ఇది’ విడుదల కోసం ఎదురుచూపులు
మరోవైపు రోషన్ ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమో ఏమో ఇది’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధమైంది. తొలుత అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే ఇప్పటివరకు కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.
ఇలా వరుస ప్రాజెక్టులతో రోషన్ తన కెరీర్లో వేగం పెంచుతున్నారు. మరి ‘జటాయు’, ‘ఏమో ఏమో ఇది’ చిత్రాలతో ఆయన ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.
