
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సీఎం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు పెట్టారు.
దేశ విద్యావ్యవస్థ అభివృద్ధికి ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు కొనియాడారు. గొప్ప పండితుడిగా స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన దేశానికి అందించిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఆయన జీవితం ఆశయాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ మహనీయుడి జయంతి సందర్భంగా మరోసారి నివాళులర్పిస్తున్నట్లు సీఎం తన పోస్టులో పేర్కొన్నారు.
