D Educt: Nov 11: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, 2 ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలు ఖరారు

గ్రూప్‌-1 పరీక్ష జనవరి 24న.. గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫిబ్రవరి 21న

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. మొత్తం 166 పోస్టులతో విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రిలిమ్స్‌ పరీక్షను జనవరి 24న నిర్వహించనున్నారు. అలాగే, 720 పోస్టులతో విడుదల చేసిన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌కు సంబంధించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ను ఫిబ్రవరి 21న నిర్వహించనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది.

గ్రూప్‌-1 పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నవంబర్‌ 9తో ముగిసింది. అయితే, అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు కమిషన్‌ అవకాశం కల్పించింది.

మరోవైపు గ్రూప్‌-2 పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్‌ 10న ప్రారంభమైంది. డిసెంబర్‌ 11వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *