
D Spiritual: Nov 12: వైభవంగా ఆకాశదీపం, సహస్ర లింగార్చన
ఇంద్రకీలాద్రి, కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆకాశదీపం ఏర్పాటు, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం దీపకాంతులతో, శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో శీనా నాయక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు హరికృష్ణ, సుబ్రమణ్య కుమార్, సరిత, పద్మావతి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
