
D Spiritual: Nov 13: మోపిదేవి నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం కుటుంబ సమేతంగా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగపుట్ట వద్ద ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్–విజయలక్ష్మి దంపతులు, ఆయన తనయుడు మండలి వెంకట్రామ్–సాయి సుప్రియ దంపతులు పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
