D Spiritual: Nov 13: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తుడు బంగారు కానుకను సమర్పించారు. ముంబైలోని చెంబూరుకు చెందిన జి.వి. వంశీకృష్ణ శుక్రవారం అమ్మవారిపై భక్తితో 38.700 గ్రాముల బరువున్న బంగారు హారాన్ని కానుకగా అందజేశారు.

ఈ సందర్భంగా బంగారు హారాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్‌కు అందజేశారు. ఆలయ అధికారులు దాతకు అధికారిక రసీదును అందించారు. అనంతరం వంశీకృష్ణ కుటుంబ సభ్యులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు.

ప్రత్యేక దర్శనం అనంతరం వేద పండితులు దాత కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్‌ దాతకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *