D Spiritual: Nov 13: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు శుక్రవారం మోపిదేవిలోని స్వయంభువుగా కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగపుట్ట వద్ద పాలు పోసి నాగదేవతకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరితో పాటు పలువురు పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *