D Spiritual: Nov 13: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం సమీపంలో ఉన్న నాగపుట్ట వద్ద శుక్రవారం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శీనా నాయక్‌, చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ తమ ధర్మపత్నులతో కలిసి నాగపుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగపుట్టలోని సర్పాలకు పాలు సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నాగదేవతలను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *