D Spiritual: Nov 17: విజయవాడ: పవిత్ర కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మకు భక్తులు స్వర్ణ కానుకలు సమర్పించారు. అమ్మవారిపై తమకున్న భక్తి, విశ్వాసాలను చాటుకుంటూ భక్తులు భారీ విలువైన బంగారు ఆభరణాలను కానుకగా అందజేశారు.

విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన సీహెచ్‌ఎల్‌జీ ప్రసూనాంబ, సీహెచ్‌ జీఎస్‌వీ ప్రసాద్ తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దుర్గమ్మ ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా 192.500 గ్రాముల బరువున్న బంగారు కాసులపేరు, 104.300 గ్రాముల బరువున్న బంగారు మంగళసూత్రాలను ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌కు అందజేశారు. వీటి మొత్తం బరువు 296.800 గ్రాములుగా ఉంది.

అదేవిధంగా కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన భక్తురాలు శిరీష కూడా సోమవారం అమ్మవారిని దర్శించుకుని 63 గ్రాముల బరువున్న నల్లపూసల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు.

అనంతరం అమ్మవారిని దర్శించుకున్న దాతలకు ఆలయ అధికారులు వేద ఆశీర్వచనం అందించారు. శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాలను అందజేసి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *