పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు ఎగుమతి సుంకాల్లో సవరణలు చేసింది. పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు పరిమితం చేయగా.. డీజిల్, ఏటీఎఫ్‌పై మాత్రం మరింత పెంచింది. నవంబర్ 16వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.

పెట్రోల్, డీజిల్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన ఎగుమతులకు సంబంధించి పన్నుల విషయంలో పలు సవరణలకు శ్రీకారం చుట్టింది. దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్‌, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ వంటివాటిపై కేంద్ర సర్కార్ అదనంగా ట్యాక్సులు విధిస్తోంది. దీనినే విండ్ ఫాల్ ట్యాక్స్‌గా పిలుస్తారు.

ప్రతీ 15 రోజులకు ఒకసారి ఎగుమతి సుంకాల్లో సవరణలు చేస్తున్న కేంద్రం.. తాజాగా కొత్త ధరలను ప్రకటించింది. నవంబర్ 16వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. రెండు వారాల పాటు ఇవి వర్తించనున్నాయి. డిసెంబర్ 1న మళ్లీ సవరణలు చేయనున్నారు.

పెట్రోల్ ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సున్నాగా కేంద్రం నిర్ణయించింది. నవంబర్ 30వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. అయితే డిజిల్‌ ఎగుమతులపై మాత్రం విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచింది. గతంలో డీజిల్‌పై లీటర్‌కు రూ.11.5గా ఉండగా.. ఇప్పుడు రూ.14కి పెంచారు. ఇక ఎటీఎఫ్‌పై లీటర్‌కు రూ.11 నుంచి రూ.12.5కి సుంకాన్ని పెంచారు.

ఈ పెంపుకు సంబంధించి కేంద్ర ఆర్ధికశాఖ నవంబర్ 16న రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ సుంకాల ప్రభావం దేశీయ ధరలపై పడదు. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో్ ఎలాంటి మార్పులు ఉండవు. కేవలం దేశంలో ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తే విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలపై ప్రభావం పడుతుంది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *