బంగారం ధరలు మరింత చౌకగా మారుతున్నాయి. రోజురోజుకి భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ధరలు సాధారణ స్థితికి చేరుకోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. జనవరిలో ఏకంగా రూ.1.80 లక్షలకు చేరుకున్న బంగారం.. నవంబర్ నాటికి భారీగా పడపోయింది. ఒకేసారి ఎంతలా అంటే..

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ ఊరట కలుగుతోంది. ధరలు రోజురోజుకు క్రమక్రమంగా దిగొస్తున్నాయి. కార్తీక మాసం రావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలైన క్రమంలో ధరలు పతనమవ్వడం పెద్ద ఊరటనిస్తోంది. రాబోయే రోజుల్లో బంగారం ధర రూ.లక్షకు చేరుకుంటుందనే అంచనాలు మొదలయ్యాయి. దీంతో భవిష్యత్తులో పసిడి ధరలు మరింత క్షీణిస్తాయనే ఆశ గోల్డ్ లవర్స్‌లో వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జనవరిలో ఆట్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్న ధరలు.. ఆ తర్వాత నుంచి దిగజారుతూ కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ప్రభుత్వ బాండ్లకు గిరాకీ పెరగడంతో ధరలు పడిపోతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

ఏకంగా రూ.44 వేలు డౌన్..

ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.80 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం నవంబర్ 17 నాటికి 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,36,040కి పడిపోయింది. అంటే ఏకంగా రూ.43,960 పడిపోయింది. ఏకంగా 30 శాతం మేర డౌన్ అయ్యాయి. 10 నెలల్లో ఊహించని స్థాయిలో ధరలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో ఈ ఏడాది చివరి నాటికి ధరలు మరింత కుప్పకూలే ఛాన్స్ ఉందని, వచ్చే ఏడాది నాటికి రూ.లక్ష దిగువకు చేరుకునే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే మళ్లీ సాధారణ స్థాయికి బంగారం ధరలు చేరుకోనున్నాయి. ధరలు డౌన్ అవ్వుతుండటంతో బంగారం కొనుగోలు చేసేవారికి లేదా గోల్డ్ ప్యూచర్స్‌లో పెట్టుబడి పెట్టేవారికి ఇదే గొప్ప అవకాశంగా నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు కూడా డౌన్

ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా కదేలయ్యాయి. జనవరిలో ఏకంగా కిలో బంగారం రూ.4,20,048కి చేరుకుని జీవితకాలపు గరిష్ట స్థాయికి చేరుకోగా.. నవంబర్ 17వ తేదీ నాటికి కిలో సిల్వర్ ధర రూ.1.90 లక్షల వద్ద కొనసాగతోంది. అంటే అప్పటితో పోలిస్తే ఏకంగా 10 నెలల వ్యవధిలోనే రూ. 2.30 లక్షల మేర తగ్గింది. ఇది భారీ తగ్గుదలగా చెప్పవచ్చు. బంగారం కంటే వెండి ప్రభావం భిన్నంగా ఉంటుంది. బంగారాన్ని కేవలం ఆభరణాలు, పెట్టుబడి కోసం ఉపయోగిస్తారు. కానీ వెండిని పారిశ్రామిక అవసరాల కోసం కూడా వినియోగిస్తారు.

రూ.లక్షకు చేరుకుంటాయా..?

అంతర్జాతీయంగా నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో పసిడి ధరలు తగ్గే అవకాశముందని అంటున్నారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో స్పాట్ ఔన్స్ 4,025 నుంచి 3,950 యూఎస్ డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత మార్కెట్లో రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు బంగారం ధరలు తగ్గవచ్చు. ఇక వెండి ధరలు కూడా ఇదే విధంగా పతనం దిశగా రావచ్చు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *