D Spiritual: Nov 17: కాణిపాకంలోని స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందజేశారు. ఇందులో భాగంగా ఐరాల మండలం మోటకంపల్లెకు చెందిన శ్రీరామచంద్రశెట్టి సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ అధికారులకు రూ.1,00,516 చెక్కును విరాళంగా సమర్పించారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన అనసూయదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. భక్తులు అందించిన విరాళాల పట్ల ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం కల్పించి, శేష వస్త్రాలు, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు సుబ్బారెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *