
D Spiritual: Nov 17: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోటదుర్గమ్మ ఆలయంలో మంగళవారం అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. అమ్మవారి గర్భాలయంలోని మూలవిరాట్ను సూర్యకిరణాలు స్పృశించడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ఏడాదిలో నవంబరు నెలలో మాత్రమే ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ తెలిపారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యకిరణాలు అమ్మవారి మూలవిరాట్ను తాకిన దృశ్యాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
