బంగారం బుడుగ ఒక్కసారిగా పేలింది. ధరలు భారీగా కుదేలవుతున్నాయి. రోజురోజుకి ధరలు కిందకు దిగొస్తున్నాయి. డాలర్ బలపడటం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కూడా తగ్గడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడంతో పెట్టుబడిదారులు ప్రభుత్వ బ్రాండ్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గోల్డ్ ధరలు దిగిస్తున్నాయి.

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూ్స్. పసిడి ధరలు ఒకేసారి కుప్పకూలాయి. బుధవారం మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లలో భారీ పతనం మొదలైంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న ధరలు.. ఇవాళ మరింత ఊరట కల్గించాయి. కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న క్రమంలో ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు ఉపశమనాన్ని కల్గిస్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.

దేశంలో బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా రూ.2,780 తగ్గాయి. నవంబర్ 18న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,260 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2780 పడిపోయింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,22,150 వద్ద ట్రేడవుతుండగా.. నేడు రూ.2550 దిగొచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి

అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,410 వద్ద లభిస్తుండగా.. నేడు ఒక్కరోజే రూ.2790 డౌన్ అయింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,22,300గా ఉండగా.. బుధవారం రూ.2550 తగ్గుముఖం పట్టింది. ఇక చెన్నై, బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక వెండి ధరలు కూడా ఒకేసారి నవంబర్ 18న రూ.5 వేల మేర క్రాష్ అయ్యాయి. ఈ తగ్గుదల తర్వాత చెన్నైలో కిలో వెండి రూ.1.85 లక్షల వద్ద పలుకుతోండగా.. నిన్న ఈ ధర రూ.1.90 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.1.85 లక్షల వద్ద ఉండగా.. ఢిల్లీలోనూ ఇదే ధర ఉంది.

దేశంలో ఇండియా బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ బంగారం, వెండ ధరలను నిర్ణయిస్తుంది. బంగారం స్వచ్చత, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. ప్రస్తుతం బంగారు ఆభరణాలపై 3 శాతం జీఎస్టీ ఉండగా.. దీనికి తోడు మేకింగ్ ఛార్జీలు దుకాణాదారులు వసూలు చేస్తారు. మీరు తయారుచేయించుకునే ఆభరణాన్ని బట్టి మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. తుది ధర ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *