తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు ప్రస్తుతం 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. దర్శన టోకెన్లు లేని సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం పూర్తవడానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80 వేల మందికి పైగా భక్తులు

నవంబర్ 17న మొత్తం 80,833 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 24,771 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా ఒక్కరోజులో రూ.4.06 కోట్ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా భక్తులకు 4 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమలలో గదుల లభ్యత ఇలా..

మరోవైపు తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్న వసతి గదుల వివరాలను టీటీడీ వెల్లడించింది. బుధవారం ఉదయం 6:29 గంటల నాటికి రూ.50, రూ.100 అద్దె విభాగాలకు చెందిన సాధారణ గదులు 770 అందుబాటులో ఉన్నాయి. అయితే రూ.1,000, రూ.1,523 అద్దె విభాగాలకు చెందిన గదులు ఖాళీగా లేవని అధికారులు స్పష్టం చేశారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రద్దీ, వసతి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *