అమరావతి: రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి బాలిక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

బాలిక చూపిస్తున్న ధైర్యాన్ని ఈ సందర్భంగా లోకేష్ అభినందించారు. ఆమె మానసికంగా, శారీరకంగా పూర్తిస్థాయిలో కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకోగా.. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

బాలిక ప్రాణాలను కాపాడటంతో పాటు, ఆమె త్వరగా కోలుకునేందుకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న మణిపాల్ ఆసుపత్రి వైద్య బృందానికి నారా లోకేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *